శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 16:23:08

వృద్ధ మ‌హిళల చికిత్స పేరుతో మోసం.. ఇద్ద‌రి అరెస్టు

వృద్ధ మ‌హిళల చికిత్స పేరుతో మోసం.. ఇద్ద‌రి అరెస్టు

హైద‌రాబాద్ : సామాజిక సేవ పేరుతో క్రౌడ్ ఫండింగ్ చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను న‌గ‌రంలోని చాంద్ర‌య‌ణ‌గుట్ట‌ పోలీసులు నేడు అరెస్టు చేశారు. స‌ల్మాన్ ఖాన్‌(29), సయీద్ ఆయుబ్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు హైద‌రాబాద్ యూత్ క‌రేజ్ పేరుతో ఓ సంస్థ‌ను స్థాపించారు. సంస్థ‌కు ఒక‌రు అధ్య‌క్షుడిగా మ‌రొక‌రు ఉపాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. అనారోగ్య‌వంతులైన వృద్ధ మ‌హిళ‌ల‌కు చికిత్స పేరుతో సోష‌ల్ మీడియా వేదిక‌గా డ‌బ్బుల‌ను విరాళంగా అందుకున్నారు. కాగా ఈ న‌గ‌దును వారి సొంత బ్యాంక్ అకౌంట్‌లోకి మ‌ళ్లించారు. వీరికి స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌రు ఆస్రా బేగం, ర‌షీద్ ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. నాంప‌ల్లి, హుమాయున్‌న‌గ‌ర్‌లో వీరిపై ఇప్ప‌టికే రెండు కేసులు న‌మోదైన‌ట్లుగా వెల్ల‌డించారు. 


logo