శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 02, 2020 , 18:55:29

మొసలిని చంపి తిన్న గ్రామస్తులు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

మొసలిని చంపి తిన్న గ్రామస్తులు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

భువనేశ్వర్‌: ఒక గ్రామానికి చెందిన ప్రజలు ఒక మొసలిని చంపి తిన్నారు. ఈ విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా పరిధిలోని కలదపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన కొందరు ఇటీవల ఒక మొసలిని పట్టుకుని దాన్ని చంపి వండుకుని తిన్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో మల్కాన్‌ జిల్లా అటవీశాఖ అధికారులు దీనిపై స్పందించారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆ జిల్లా అటవీ అధికారి ప్రదీప్ తెలిపారు. వన్యప్రాణి అయిన మొసలిని చంపి తిన్న నిందులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. logo