సోమవారం 18 జనవరి 2021
Crime - Nov 15, 2020 , 18:01:46

భార్య ప్రియుడి చేతిలో రౌడీషీట‌ర్ హ‌త్య‌!

భార్య ప్రియుడి చేతిలో రౌడీషీట‌ర్ హ‌త్య‌!

థానే: మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో దారుణ హ‌త్య జ‌రిగింది. 31 ఏండ్ల వ‌య‌సుగ‌ల ఓ రౌడీ షీట‌ర్‌ను అత‌ని భార్య ప్రియుడు దీప‌క్ మోరే (30) అత్యంత దారుణంగా హ‌త్య చేశాడు. థానే జిల్లా దొంబివాలి ప‌ట్ట‌ణ స‌మీపంలోని ఆయ్‌రే గ్రామంలో శని, ఆదివారాల‌కు మ‌ధ్య అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మృతుడి భార్య ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. 

స్థానికుల‌ను విచారించి ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య‌కు నిందితుడికి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్లు త‌మ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని పోలీసులు చెప్పారు. ఈ వివాహేత‌ర సంబంధ‌మే హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చని వారు అనుమానిస్తున్నారు. హంత‌కుడు త‌ల‌పై బండ‌రాయితో మోదీ హ‌త్య‌చేసిన‌ట్లు ఘ‌ట‌నా స్థ‌లంలోని ఆధారాల‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి హ‌త్య కేసు న‌మోదు చేశారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.