వికారాబాద్ : ఎక్సైజ్ సూపరింటెండెంట్ కారు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లికి చెందిన గౌస్(34) ఎన్నెపల్లిలో మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. గౌస్ మన్నెగూడ నుంచి ఒక బైక్‌ను లిప్ట్ అడిగి వస్తుండగా వికారాబాద్ పట్టణం శివారెడ్డిపేట సమీపంలోకి రావడంతో రెండు వాహనాలు ఢీకొని కిందపడిపోయారు.
బైక్‌పై వస్తున్న ఎన్నెపల్లికి చెందిన గౌస్ పై నుంచి వికారాబాద్ సూపరింటెండెంట్ వరప్రసాద్ కారు వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా గౌస్ మృతి చెందాడు. గౌస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.