వికారాబాద్ : అనుమానాస్పదంగా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లికి చెందిన దేవుడు(50) ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.