మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 17, 2020 , 19:21:01

అన్న‌ను ఖ‌న‌నం చేసిన చోటే న‌న్ను కూడా.. చెల్లి అభ్య‌ర్థ‌న‌

అన్న‌ను ఖ‌న‌నం చేసిన చోటే న‌న్ను కూడా.. చెల్లి అభ్య‌ర్థ‌న‌

అహ్మ‌దాబాద్ : అన్నంటే ఆమెకు అమిత‌మైన ప్రేమ‌. వ‌దిన చ‌నిపోవ‌డంతో అన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఓ చెల్లి తీవ్ర మాన‌సిక వేదన‌కు గురైంది. తాను కూడా అన్న వ‌ద్ద‌కు వెళ్తాన‌ని, అన్న‌ను ఎక్క‌డైతే ఖ‌న‌నం చేశారో.. త‌న‌ను కూడా అక్క‌డే ఖ‌న‌నం చేయాల‌ని సూసైడ్ నోట్‌లో పేర్కొని ఉరేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న గుజ‌రాత్ అహ్మ‌దాబాద్ జిల్లాలోని రామోల్ ఏరియాలో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

17 ఏళ్ల బాలిక త‌న త‌ల్లిదండ్రులు, ఇద్ద‌రు అన్న‌లు, ఒక త‌మ్మునితో క‌లిసి రామోల్‌లోని ర‌వీన‌గ‌ర్‌లో నివాస‌ముంటోంది. అదే ప్రాంతంలో బాలిక క‌జిన్ బ్ర‌ద‌ర్ కూడా నివాస‌ముంటున్నాడు. అయితే క‌జిన్ బ్ర‌ద‌ర్ అంటే ఆ యువ‌తికి ప్రాణం. ఇటీవ‌లే క‌జిన్ బ్ర‌ద‌ర్ భార్య రోడ్డుప్ర‌మాదంలో మ‌ర‌ణించింది. త‌న భార్య లేని జీవితం త‌న‌కెందుకు అని అత‌ను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఆమె తీవ్ర మ‌నస్తాపం చెందింది. అన్న లేని జీవితాన్ని ఊహించుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలో శ‌నివారం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఉరేసుకున్న కూతురిని చూసి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. 

త‌న‌ను కూడా అన్నను ఖ‌న‌నం చేసిన చోటే ఖ‌న‌నం చేయాల‌ని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యువ‌తి మృత‌దేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించిన అనంత‌రం శ‌వాన్ని కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo