శుక్రవారం 22 జనవరి 2021
Crime - Jan 12, 2021 , 21:01:02

ఊయలే ఉసురు తీసింది.. ఉరిపడి రెండేళ్ల చిన్నారి మృతి

ఊయలే ఉసురు తీసింది.. ఉరిపడి రెండేళ్ల చిన్నారి మృతి

తుంగతుర్తి :  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఊయల దిగే యత్నంలో మెడకు ఉరి బిగుసుకుపోయి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కొత్తగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలివి.. గ్రామానికి చెందిన జటంగి లింగరాజు- శైలజ దంపతలకు ఐదేండ్లలోపు ఇద్దరు కుమారులున్నాయి. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

చిన్నకుమారుడు చిన్ను(2)ను చూసుకునేందుకు ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో ఉదయం వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లారు. తాము పనిచేసే సమీపంలోనే చెట్టుకు చీరెతో ఊయల కట్టి బాలుడిని పడుకోబెట్టారు. కాసేపటి తరువాత నిద్ర లేచిన బాలుడు తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఏడ్చి ఊయల దిగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో చీరె మెడకు చుట్టుకుపోయి ఉరి బిగుసుకుని మృతి చెందాడు.  కుమారుడి మృతిని తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తామేం పాపం చేశామని గుండెలు బాదుకుంటూ విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo