శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 13:50:48

భూపాలపల్లిలో నకిలీ విత్తనాల గుట్టు రట్టు

భూపాలపల్లిలో నకిలీ విత్తనాల గుట్టు రట్టు

భూపాలపల్లి: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టయ్యింది. గణపురం మండలం చెల్పూరులో రూ.5 లక్షల విలువైన ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విత్తనాలను అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశామని జిల్లా ఇన్‌చార్చి ఎస్పీ సంగ్రాం పాటిల్‌ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.35 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.logo