ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 05, 2020 , 21:54:33

మైనర్‌పై లైంగిక దాడి యత్నం.. సీపీ సీరియస్‌

మైనర్‌పై లైంగిక దాడి యత్నం.. సీపీ సీరియస్‌

ఖమ్మం : నగరంలో ఓ 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం, హత్యాయత్నం ఘటనపై పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సీరియస్‌ అయ్యారు. నగరంలోని పార్శిబందంలో ఓ ఇంట్లో పని చేస్తున్న బాలికపై యజమాని కుమారుడు బాలికను ప్రలోభ పెట్టి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ప్రతి ఘటించడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ విషయం పీఆర్‌వో, స్పెషల్‌ బ్రాంచ్‌ నిఘా విభాగానికి సమాచారం అందింది. దీంతో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ స్వయంగా విచారణ ప్రారంభించారు. అడిషనల్‌ డీసీపీ ఇంజారపు పూజను విచారణకు ఆదేశించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నారు.

బాలిక మరణ వాంగ్మూలం రికార్డు చేసేందుకు జడ్జిని అభ్యర్థించారు. ఆయన అనుమతి ఇవ్వడంతో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా.. స్పందించిన ఆమె జిల్లా వైద్యాధికారిని పంపారు. బాధితురాలు ఓ ప్రైవేటు హాస్పిటల్‌ చికిత్స పొందుతుండగా సీపీ పరామర్శించారు. బాధితురాలు, తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందుతులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీపీ వెంట టౌన్‌ ఏసీపీ ఆంజనేయులు, సీఐ చిట్టిబాబు, తుమ్మ గోపి, వెంకన్న బాబు ఉన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo