బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 16:25:00

పెద్దపులి దాడిలో లేగదూడ మృతి

పెద్దపులి దాడిలో లేగదూడ మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కౌటాల మండలం కనికి అటవీ ప్రాంతంలో పెద్దపల్లి దాడిలో లేగదూడ మృతి చెందినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి ప్రకాష్ నాయక్ తెలిపారు. బోధంపల్లి గ్రామానికి చెందిన కొండ లింబుకి చెందిన లేగదూడ మేతకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో సంఘటన చోటుచేసుకున్నట్టు ఆయన తెలిపారు. పెద్దపులి అడుగులు సైతం గుర్తించినట్లు  ఆయన పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


logo