సోమవారం 03 ఆగస్టు 2020
Crime - Jun 25, 2020 , 14:47:16

మ‌ద్యం కోసం.. క‌రోనా వార్డు నుంచి ప‌రార్

మ‌ద్యం కోసం.. క‌రోనా వార్డు నుంచి ప‌రార్

బెంగ‌ళూరు : మ‌ద్యం కోసం ఓ వ్య‌క్తి క‌రోనా వార్డు నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. జూన్ 19న 30 ఏళ్ల వ్య‌క్తి.. త‌న స్నేహితుడిని(19) క‌త్తితో పొడిచి చంపాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా కొవిడ్-19 ప‌రీక్ష‌లు చేయించారు. ఈ ప‌రీక్ష‌ల్లో అత‌నికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. 

ఈ క్ర‌మంలో నిందితుడిని బెంగ‌ళూరులోని విక్టోరియా ఆస్ప‌త్రిలో మంగ‌ళ‌వారం చేర్పించారు. బుధ‌వారం ఉద‌యం అత‌నికి చేతికి గాయం కావ‌డంతో.. వేరే వార్డుకు త‌ర‌లించి చికిత్స చేసేందుకు న‌ర్సు సిద్ధ‌మ‌వుతోంది. ఇదే అదునుగా భావించిన నిందిత‌డు.. అక్క‌డున్న న‌ర్సులు, సెక్యూరిటీ సిబ్బందిని నెట్టేసి ఆస్ప‌త్రి నుంచి పారిపోయాడు. 

అంత‌కు ముందే త‌న స్నేహితుడికి ఫోన్ చేసి త‌న‌కు మ‌ద్యం కావాల‌ని కోరాడు. నిందితుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు స్నేహితుడికి తెలిసిన‌ప్ప‌టికీ.. మ‌ద్యం కోసం పుష్పంజ‌లి థియేట‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అంత‌లోపే ఆస్ప‌త్రి సిబ్బంది, పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. నిందితుడితో పాటు అత‌ని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

మ‌ద్యం కోస‌మే నిందితుడు ఆస్ప‌త్రి నుంచి ప‌రారీ అయ్యాడ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. పోలీసులు.. వీరిద్ద‌రిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  


logo