సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 17, 2020 , 18:40:27

కరోనా పాజిటివ్ మహిళపై లైంగికదాడి

కరోనా పాజిటివ్ మహిళపై లైంగికదాడి

ముంబై: కరోనా వైరస్ సోకిన ఒక మహిళపై లైంగిక దాడి జరిగింది. మహారాష్ట్రలోని ముంబై‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 40 ఏండ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని పన్వెల్ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రంలో ఆమె ఉంటున్నది. కాగా, గురువారం రాత్రి ఒక వ్యక్తి ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పన్వెల్ పోలీస్ స్టేషన్ అధికారి అశోక్ రాజ్‌పుత్ తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి.


logo