శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 10:54:18

కరోనాతో చికిత్స పొందుతూ దవాఖాన కిటికీలోంచి దూకి..

కరోనాతో చికిత్స పొందుతూ దవాఖాన కిటికీలోంచి దూకి..

మొరాదాబాద్‌ : కరోనాతో చికిత్స పొందుతున్న మహిళ దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా తీర్థంకర్ మహావీర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించబడిన మహిళను ఇటీవల వైద్య అధికారులు టీఎంఎంయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఉన్నట్టుండి ఆమె దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మహిళ కిటికీలో నుంచి దూకిన దృశ్యాలు వార్డులోని సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను భద్రపరిచామని, కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని క్రైమ్ విభాగం సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) అశోక్ కుమార్ తెలిపారు.


logo