గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 28, 2020 , 16:45:31

కరోనాతో చికిత్స పొందుతూ బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్య

కరోనాతో చికిత్స పొందుతూ బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్య

మొరాదాబాద్ : ఉత్తరప్రదేశ్‌ని మొరాదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న బ్యాంక్‌ మేనేజర్‌ దవాఖాన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ (42) అనే వ్యక్తికి జూలై 21న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు 25న స్థానిక తీర్థంకర్ మహావీర్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి మెడికల్ కళాశాల ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మొరాదాబాద్ నగర ఎస్పీ అమిత్ ఆనంద్ చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo