మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 14:41:48

ఛతీస్‌గఢ్‌లో ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి

ఛతీస్‌గఢ్‌లో ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి

జష్‌పూర్‌ : ఐదేండ్ల చిన్నారిని ఆమెకు వరసకు సోదరుడయ్యే యువకుడు అపహరించి లైంగికదాడి చేసి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని  జష్‌పూర్ జిల్లాలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జష్పూర్ జిల్లా బాగిచా గ్రామంలో జులై 24న ఓ యువకుడు తనకు సోదరి వరుసయ్యే ఐదేండ్ల బాలికను అపహరించాడు. గ్రామశివారులోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసి హత్య మార్చాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు జులై 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు కుమారుడి వరుసయ్యే యువకుడిపై వారు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాగిచా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి భాస్కర్‌శర్మ తెలిపారు. 


logo