మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 15:04:10

రక్తపు మడుగులో నలుగురు కుటుంబ సభ్యులు.. హత్యా? ఆత్మహత్యా?

రక్తపు మడుగులో నలుగురు కుటుంబ సభ్యులు.. హత్యా? ఆత్మహత్యా?

నాసిక్ : మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని మాలెగావ్ తాలూకాలోని ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలతో సహా భార్యభర్త రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారందరి గొంతు కోసినట్లు ఉండగా ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

నాసిక్‌ జిల్లాకు చెందిన సమాధన్‌ అన్నా చవాన్ (35), భార్య భరతాబాయి (26) తమ నాలుగేండ్ల ఇద్దరు పిల్లలతో కలిసి జేయూర్‌ శివారులోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. చవాన్‌ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. భార్య కూలి పనులకు వెళ్తుండేది. ఇద్దరు చిన్నారులతో పాటు భార్య భర్త ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి వారి గొంతు కోసినట్లు ఉండడాన్ని గమనించారు. కేసు నమోదు చేసుకుని ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo