గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 03, 2020 , 11:45:22

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : చిల‌క‌ల‌గూడ పోలీసు స్టేష‌న్‌ ప‌రిధిలోని అంబ‌ర్‌న‌గ‌ర్‌లో ఇద్ద‌రు దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఇద్ద‌రు దంప‌తులు త‌మ ఇంట్లోనే ఉరేసుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందుల‌తోనే దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. మృతుల‌ను వెంక‌టేశ్‌, భార్గ‌విగా పోలీసులు గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


logo