గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 26, 2020 , 13:02:39

కామారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

కామారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

కామారెడ్డి : జిల్లా కేంద్రానికి సమీపంలో గల గుమస్తా కాలనీ వద్ద జంట హత్యలు కలకలం సృష్టించాయి. గుమస్తా కాలనీలో ఉంటున్న కొయ్యల లక్ష్మయ్య, ఆర్ఎంపీ వైద్యుడు వడ్ల సుధాకర్ దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మయ్య ఆరోగ్యం బాగలేక నెల రోజులుగా తన చెల్లెలు సుజాత వద్ద ఉంటున్నాడు. లక్ష్మయ్యకు ఆర్ఎంపీ వైద్యుడు సుధాకర్ వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహ బంధం బలపడింది.

 గురువారం రాత్రి ఇద్దరు కలిసి చుక్కపూర్ లో ఒకరికి చికిత్స చేయడానికి కలిసి వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక చోట కూర్చుని మద్యం సేవిస్తుండగా వీరిపై దాడి జరిగినట్లు తెలిపారు. లక్ష్మయ్యను విచక్షణ రహితంగా నరికి చంపగా.. సుధాకర్ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెంటపడి మరీ కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తమకు ఎవరు శత్రువులు లేరని, ఎవరో కావాలనే చంపినట్లు సుధాకర్ భార్య స్వప్న తెలిపింది.


 సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. మృతుడు సుధాకర్ కు భార్య స్వప్న, ఐదు సంవత్సరాల కొడుకు సుమిత్, ఎనిమిది సంవత్సరాల పాప సంజన ఉన్నారు. మరో మృతుడు లక్ష్మయ్యకు భార్య వెంకటమ్మ కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 


logo