ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 28, 2020 , 15:11:08

ఒకే ఇంట్లో ముగ్గురిని పొడిచి చంపిన దుండ‌గులు

ఒకే ఇంట్లో ముగ్గురిని పొడిచి చంపిన దుండ‌గులు

ఔరంగాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్ జిల్లాలో శ‌నివారం తెల్ల‌వారుజామున దారుణం జ‌రిగింది. జిల్లాలోని ఓల్డ్ కౌసాన్ గ్రామంలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఓ ఇంట్లో చొర‌బ‌డి.. ముగ్గురిని దారుణంగా హ‌త్యచేశారు. భ‌ర్త‌, భార్య వారి ప‌దేండ్ల కూతురును క‌త్తుల‌తో పొడిచి కిరాత‌కంగా చంపేశారు. ఈ దాడిలో మ‌రో ఆరేండ్ల బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ హ‌త్య‌ల‌కు సంబంధించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ హ‌త్య‌లు శనివారం తెల్ల‌వారుజామున ఒంటిగంట నుంచి 4 గంట‌ల మ‌ధ్య జ‌రిగి ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ హ‌త్య‌ల‌ను ఒకే వ్య‌క్తి చేశాడా లేక కొంత‌మంది గుంపులుగా వ‌చ్చి హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారా.? అనే కోణంలో దర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. మృతులు రాజు నివారే (35), అతని భార్య అశ్విని నివారే (30), వారి కూతురు స‌యాలీ (10) గా గుర్తించారు. మ‌రో చిన్నారి సోహ‌మ్ (6) తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడ‌ని వెల్ల‌డించారు. హ‌త్య‌లు జ‌రిగిన ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లు ఎలాంటి ఆన‌వాళ్లు క‌నిపంచడంలేద‌ని, హ‌త్య‌ల‌కుగ‌ల కార‌ణం తెలియాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo