శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 31, 2020 , 07:02:45

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

వరంగల్‌ : రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా.. చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దామెర మండల పరిధిలో జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. మృతులు మలుగు జిల్లా యాపలగడ్డకు చెందిన తాడెం శ్రీనివాస్‌ (40), మమత (35)గా గుర్తించారు. దంపతులు తమ చిన్నారితో కలిసి వరంగల్‌కు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో దామెర మండల పరిధిలో ఎదురెదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టుకోవడంతో అక్కడికక్కడే దంపతులు మృతి చెందగా, చిన్నారి గాయపడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo