మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 11, 2020 , 18:45:05

చేత‌బ‌డి చేశార‌ని దంప‌తుల దారుణ హ‌త్య‌

చేత‌బ‌డి చేశార‌ని దంప‌తుల దారుణ హ‌త్య‌

రాంచి: జార్ఖండ్ రాష్ట్రంలోని లొహ‌ర్ద‌గ జిల్లాలో దారుణం జ‌రిగింది. జిల్లాలోని పుతార్ గ్రామానికి చెందిన దంప‌తులను చేత‌బ‌డి చేస్తున్నార‌న్న‌ అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు కొట్టిచంపారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పుతార్ గ్రామానికి చెందిన రామ్‌సేవ‌క్ భ‌గ‌త్‌, అత‌ని భార్య‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అయితే ఆ దంప‌తులిద్ద‌రూ చేత‌బ‌డి చేస్తున్నార‌నే అనుమానంతో గ్రామంలోని కొంద‌రు వ్య‌క్తులు వారిపై క‌క్ష పెంచుకున్నారు. 

ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి కొంద‌రు క‌ర్ర‌లు, రాళ్లు తీసుకుని రామ్‌సేవ‌క్ భ‌గ‌త్ ఇంటికి వెళ్లారు. నిద్ర‌పోతున్న దంప‌తుల‌ను బ‌య‌టికి ర‌ప్పించి దారుణంగా కొట్టారు. క‌ర్ర‌లు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డంతో దంప‌తులిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.