బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 19:16:46

చోరీ సొత్తుతో ఇంటి నిర్మాణం.. దంప‌తులు అరెస్టు

చోరీ సొత్తుతో ఇంటి నిర్మాణం.. దంప‌తులు అరెస్టు

హైద‌రాబాద్ : ప‌లు ఇండ్ల‌ను కొల్ల‌గొట్టిన కేసుల్లో నిందితులుగా ఉన్న భార్యాభ‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న న‌గ‌రంలోని రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధి ఇబ్ర‌హీంప‌ట్నంలోని ఖానాపూర్ గేట్ వ‌ద్ద మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. దంప‌తులు కె. ర‌వికుమార్‌(25), ఎం. గీతాంజ‌లి(21) ఏపీ, తెలంగాణ‌లో జ‌రిగిన 17 దొంగ‌త‌నాల కేసుల్లో నిందితులుగా ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వీరి స్వ‌స్థ‌లం ఏపీలోని గుంటురు జిల్లా న‌ర‌స‌రావుపేట కాగా న‌గ‌రంలోని కొండాపూర్‌లో నివాస‌ముంటున్నారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ. 16 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. దొంగిలించిన మోటార్ బైక్‌ల‌పై వెళ్తూ తాళం వేసిన ఇండ్ల‌ను గ‌మ‌నించి రాత్రి స‌మ‌యాల్లో చోరీకి పాల్ప‌డేవార‌ని పోలీసులు వెల్ల‌డించారు. చోరీ సొత్తుతోనే భూమిని కొనుగోలు చేసి దాంట్లో ఇంటి నిర్మాణం చేప‌ట్టిన‌ట్లుగా పేర్కొన్నారు. 


logo