గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 19:22:31

చిన్న తగాదాకే యువ‌జంట ఆత్మ‌హ‌త్య‌

చిన్న తగాదాకే యువ‌జంట ఆత్మ‌హ‌త్య‌

బాందా: జీవితం ఎంతో విలువైన‌ది. జీవిత‌మే మ‌న‌కు ఈ ప్ర‌పంచాన్ని ఆస్వాదించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ది. కానీ జీవితం విలువ తెలియ‌ని కొంద‌రు క్ష‌ణికావేశంలో చిన్న విష‌యాల‌కే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం తింద్వారీ ఏరియాలోని బెండా గ్రామంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. భార్యభ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన చిన్న గొడ‌వ‌కే మ‌న‌స్తాపం చెంది యువ‌జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఇంట్లోని ఫ్యాన్ హుక్‌ల‌కు ఉరేసుకుని ఉసురు తీసుకున్న‌ది. 

బెండా గ్రామంలో సంతోష్ (22), అత‌ని భార్య ఆర్తి (20) ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి నివాసం ఉంటున్నారు. సోమ‌వారం రాత్రి భార్యాభ‌ర్తల మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రిగింది. దీంతో గొడ‌వ మ‌రింత పెద్ద‌ది కాకుండా క‌లుగ‌జేసుకున్న కుటుంబ‌స‌భ్యులు ఇద్ద‌రికీ న‌చ్చ‌జెప్పి ప‌డుకున్నారు. అయితే ఈ తెల్ల‌వారు జామున వారు నిద్ర‌లేచి చూసేస‌రికి ఇద్ద‌రూ త‌మ గ‌దిలో సీలింగ్ హుక్‌కు వేలాడుతూ క‌నిపించారు. 

ఏడాది క్రిత‌మే సంతోష్‌, ఆర్తిల వివాహం జ‌రిగింద‌ని, చిన్న విష‌యానికే వారు ఇంత ఘోర‌మైన నిర్ణ‌యం తీసుకుంటార‌ని తాము ఊహించ‌లేద‌ని కుటుంబ‌స‌భ్యులు విల‌పిస్తున్నారు. కాగా, ఈ ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo