శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 26, 2020 , 16:49:02

భార్యాభ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య‌.. బిడ్డ‌ను తీసుకెళ్లండ‌ని మేసేజ్

భార్యాభ‌ర్త‌లు ఆత్మ‌హ‌త్య‌.. బిడ్డ‌ను తీసుకెళ్లండ‌ని మేసేజ్

ల‌క్నో : ఓ ఇద్ద‌రు దంపతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఒంట‌రిగా ఉన్న త‌మ ఎనిమిది నెల‌ల బిడ్డ‌ను తీసుకెళ్లాల‌ని బంధువుల‌కు మేసేజ్ చేశారు. ఈ విషాద ఘ‌ట‌న ఘ‌జియాబాద్ లోని ఇందిరాపురం ప్రాంతంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది. 

బీహార్ రాజ‌ధాని పాట్నాకు చెందిన దంప‌తులిద్ద‌రూ బ‌తుకుదెరువు కోసం 10 నెల‌ల క్రితం ఇందిరాపురం వ‌చ్చారు. భ‌ర్తేమో నోయిడాలోని ఓ ప్ర‌యివేటు కంపెనీలో ప‌ని చేస్తున్నాడు. భార్యేమో ఇంట్లోనే ఉంటుంది. అయితే లాక్ డౌన్ అమ‌లైన‌ప్ప‌టి నుంచి.. అత‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. 

మొత్తానికి ఏమైందో తెలియదు కానీ.. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వేర్వేరు గ‌దుల్లో విగ‌త జీవులుగా ప‌డి ఉన్నారు. వీరు ఆత్మ‌హ‌త్య చేసుకునే కంటే ముందు.. ఆమె మొబైల్ ఫోన్ నుంచి గ్రేట‌ర్ నోయిడాలో ఉంటున్న‌ త‌న సోద‌రికి  తెల్ల‌వారుజామున 3:45 గంట‌ల‌కు మేసేజ్ పంపింది.  పొద్దున్నే వ‌చ్చి ఒంట‌రిగా ఉన్న త‌న ఎనిమిది నెల‌ల కూతురిని తీసుకెళ్లాల‌ని మేసేజ్ లో రాసింది. మేసేజ్ చూసుకున్న సోద‌రి.. త‌న స్నేహితురాలిని వారి ఇంటికి పంపింది. 

డోర్ లాక్ వేసి ఉంది. పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డికి చేరుకున్నారు. పోలీసులు వ‌చ్చి తలుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా.. భార్యాభ‌ర్త‌ల మృత‌దేహాలు వేర్వేరు గ‌దుల్లో ఉన్నాయి. కూతురేమో త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద ఉంది.  చిన్నారిని మృతురాలి సోద‌రి తీసుకెళ్లింది. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఎలాంటి 

సూసైడ్ నోట్ ల‌భించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. భార్యాభ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు దృష్టి సారించారు. వీరిద్ద‌రూ ఈ మ‌ధ్య‌లో గొడ‌వ ప‌డిన సంద‌ర్భాలు లేవ‌ని స్థానికులు చెప్పారు. 


logo