బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 18:11:35

అద్దె ఇంట్లో దంపతుల ఆత్మహత్య.!

అద్దె ఇంట్లో దంపతుల ఆత్మహత్య.!

నోయిడా : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని హోషియార్‌పూర్‌ సెక్టార్‌ 51 ప్రాంతంలోని అద్దె ఇంట్లో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు శనివారం పోలీసులు తెలిపారు. హోషియార్‌పూర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి లోపలి నుంచి చిన్నారి ఏడుపు వినిపిస్తున్నా కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా 8 నెలల చిన్నారి కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఆ పక్కనే దంపతుల మృతదేహాలు పడి ఉన్నాయి.

దంపతులు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) రణ్‌విజయ్‌ సింగ్‌ తెలిపారు. ఘటనా స్థలంలో ఆత్మహత్య లేఖలాంటివి లభించ లేదని పేర్కొన్నారు. విచారణలో  దంపతులు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించామని జూలై 7న వీరు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపామని తెలిపారు. బీహార్‌లోని దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు దర్యాప్తు పూర్తయిన అనంతరం మృతిగల కారణాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.


తాజావార్తలు


logo