మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 21, 2020 , 13:25:50

అద్దెకు దిగిన తెల్లారే ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌!

అద్దెకు దిగిన తెల్లారే ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌!

ల‌క్నో: కొత్త కాపురం పెట్టేందుకు ఓ ఇంట్లో అద్దెకు దిగిన తెల్లారే ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం హ‌మీపూర్ జిల్లా ర‌థ్ టౌన్‌షిప్ ప‌రిధిలోని నాయ్ బ‌స్తీ ఏరియాలో చోటుచేసుకుంది. ఓ 22 ఏండ్ల యువ‌కుడు త‌న సోద‌రుడి కుటుంబంతో క‌లిసి మ‌‌‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చ‌త్తార్‌పూర్ జిల్లా నుంచి బ‌తుకుదెరువు కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చాడు. సోదరుడి ఇంట్లోనే ఉంటూ రిక్షాలాగి జీవ‌నం సాగిస్తున్నాడు.

అయితే, గత‌ రెండేండ్లుగా త‌న అక్క కూతురు (17)ను ప్రేమిస్తున్న అత‌డు ఇటీవ‌ల ఆమెను హ‌మీపూర్‌కు తీసుకొచ్చి వేరు కాపురం పెట్టాడు. గురువారం రోజే త‌న సోద‌రుడి ఇంటి నుంచి అద్దె ఇంటికి మారాడు. శుక్ర‌వారం ఇద్ద‌రూ క‌లిసి ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. జంట ఆత్మ‌హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.