మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 16:20:58

భర్త ఫ్యాన్‌కు,భార్య బాత్రూమ్‌ కిటికీకి ఉరేసున్నారు...

భర్త ఫ్యాన్‌కు,భార్య బాత్రూమ్‌ కిటికీకి ఉరేసున్నారు...

హైదరాబాద్ : కుటుంబ కలహాల కారణంగా దంపతులిద్దరూ ఆత్మహత్య కు పాలపడ్డారు. ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్, భార్గవి దంపతులు గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్‌కు భార్గవి అనే మహిళతో ఎనిమి దేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

వెంకటేశ్‌ విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తుండగా, భార్గవి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నది. అత్తమామలు వేధింపులకు గురిచేస్తుండటంతో భార్గవి భర్తతో కలిసి బయటకు వచ్చేసి కొంతకాలం క్రితం వేరు కాపురం పెట్టింది. ప్రస్తుతం వీరు చిలకలగూడ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, భార్గవి బాత్రూమ్‌ కిటికీకి ఉరేసుకుంది. దీంతో కుటుంబసభ్యులు చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo