శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 22:54:54

దోపిడీ కేసులో భార్యాభర్తలు అరెస్టు

దోపిడీ కేసులో భార్యాభర్తలు అరెస్టు

న్యూఢిల్లీ : రెండు దోపిడీ కేసుల్లో ప్రవేయం ఉందని భావిస్తున్న భార్యాభర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. దేశరాజధాని లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే ప్రకాశ్‌ మండాల్‌ దంపతులు అమాయకులను బెదిరించి డబ్బులు గుంజేవారని, ఒకవేళ విఫలమైతే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసే వారిని బాధితులు పోలీసులు ఎదుట తెలిపారు. గత నెల ౩౦న జోగత్‌పురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు వీరిని చాకచక్యంగా అరెస్టు చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వారిపై ఐపీసీ 384, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరిన్ని నేరాల్లో వీరి భాగస్వామ్యముందని ఫిర్యాదులు అందుతుండడంతో విచారణ జరుపుతున్నామని పోలీసుల ఉన్నతాధికారులు వెల్లడించారు.logo