శనివారం 16 జనవరి 2021
Crime - Nov 26, 2020 , 19:03:36

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇంట్లో చొర‌బ‌డి ముగ్గురి దారుణ‌హ‌త్య‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇంట్లో చొర‌బ‌డి ముగ్గురి దారుణ‌హ‌త్య‌

భోపాల్‌: మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రం రత్లాం జిల్లాలోని రాజీవ్‌న‌గ‌ర్ ఏరియాలో దారుణం జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఓ ఇంట్లో చొర‌బ‌డి ముగ్గురిని దారుణంగా కాల్చిచంపాడు. మృతులు గోవింద్ సోలంకి (50), అతని భార్య శార‌ద (45), కుమార్తె దివ్య (21)గా స్థానికులు తెలిపారు. గురువారం తెల్ల‌వారుజామున‌ సోలంకి ఇంటి త‌లుపులు తెరిచి ఉన్నాయ‌ని, ఇంటి త‌లుపులు తెరిచి ఉన్నా ఎవ‌రూ ఇంట్లోంచి బ‌య‌టికి రావ‌డంగానీ, బ‌య‌టి నుంచి ఇంట్లోకి వెళ్ల‌డంగానీ క‌నిపించ‌లేద‌ని, దాంతో అనుమానం వ‌చ్చి ఇంట్లోకి వెళ్లి చూడ‌గా ముగ్గురు ర‌క్తపు మ‌డుగులో ప‌డి ఉన్నార‌ని ఇరుగుపొరుగు వెల్ల‌డించారు. 

కాగా, స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. మృతుల‌పై ఒంటిపై బుల్లెట్ గాయాల‌ను గుర్తించారు. తుపాకీతో కాల్చిచంపినా ప‌క్కింటి వారు మాత్రం త‌మ‌కు ఎలాంటి శ‌బ్దం విన‌ప‌డ‌లేద‌ని చెప్పారు. అయితే, బుధ‌వారం రాత్రి దేవోత్త‌యిని ఏకాద‌శి నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ప‌టాకులు కాల్చార‌ని, దుండ‌గుడు తెలివిగా ఆ స‌మ‌యంలోనే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.