శనివారం 30 మే 2020
Crime - Mar 28, 2020 , 15:40:03

వృద్ధురాలిని కొరికి చంపిన క‌రోనా అనుమానితుడు

వృద్ధురాలిని కొరికి చంపిన క‌రోనా అనుమానితుడు

చెన్నై: త‌మిళ‌నాడులో దారుణం జ‌రిగింది. హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న ఓ 34 ఏండ్ల‌ వ్య‌క్తి ఉన్న‌ట్టుండి పిచ్చిప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తించాడు. శుక్ర‌వారం రాత్రి త‌న‌ ఇంట్లో హోమ్ క్వారెంటైన్ నుంచి త‌ప్పించుకుని దుస్తులు లేకుండా వీధుల్లోకి ప‌రుగులు తీశాడు. ఆరు బ‌య‌ట ఓ ఇంటి ముందు నిద్రిస్తున్న న‌ట్చి అమ్మాల్ అనే  90 ఏండ్ల‌ వృద్ధురాలిపై దాడి చేశాడు. ఆ త‌ర్వాత‌ ర‌క్తం వ‌చ్చేలా ఆమె గొంతును కొరికేశాడు. వృద్ధురాలి కేక‌లు విని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇరుగుపొరుగువారు నిందితుడిని ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు. 

తీవ్రంగా గాయ‌ప‌డ్డ వృద్ధురాలిని పోలీసుల సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు కన్నుమూసింది. త‌మిళ‌నాడులోని థేని జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నిందితుడు వారం రోజుల క్రితమే శ్రీలంక నుంచి స్వ‌గ్రామానికి వ‌చ్చాడు. క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో అధికారులు అత‌డిని 14 రోజులపాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండ‌మ‌ని ఆదేశించారు. దీంతో వారం రోజులుగా హోమ్ క్వారెంటైన్‌లో ఉన్న అత‌డు శుక్ర‌వారం రాత్రి ఉన్న‌ట్టుండి పిచ్చిప‌ట్టిన‌వాడిలా చేశాడు. ఓ అమాయ‌క వృద్ధురాలి ప్రాణం తీశాడు.  


logo