గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 12, 2020 , 14:50:31

ద‌వాఖాన నుంచి క‌రోనా ఖైదీలు ప‌రార్‌.. ముగ్గురు కానిస్టేబుళ్లు స‌స్పెండ్‌

ద‌వాఖాన నుంచి క‌రోనా ఖైదీలు ప‌రార్‌.. ముగ్గురు కానిస్టేబుళ్లు స‌స్పెండ్‌

చిత్రకూట్ : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం చిత్ర‌కూట్‌లో క‌రోనా సోకి ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న ఇద్ద‌రు ఖైదీలు త‌ప్పించుకోవ‌డంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు కానిస్టేబుళ్ల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు పోలీస్ ఉన్న‌తాధికారులు శ‌నివారం తెలిపారు. లైంగిక‌దాడి కేసులో నిందితులుగా ఉన్న రాజుయాద‌వ్‌, బ్రిజ్‌లాల్‌ల‌కు క‌రోనా సోక‌డంతో సెప్టెంబ‌ర్ 7న ద‌వాఖాన‌లో చేర్చారు. 

గురువారం తెల్ల‌వారుజామున వారిద్ద‌రు మ‌రుగుదొడ్డి కిటికీల‌ను ప‌గుల‌కొట్టి త‌ప్పించుకున్నారు. వారిలో బ్రిజ్‌లాల్‌ను గురువారం అర్థ‌రాత్రి ప‌ట్టుకున్నారు. అయితే రాజు యాద‌వ్ ఆచూకీ ఇంకా ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ద‌వాఖాన నుంచి ఖైదీలు త‌ప్పించుకున్న కేసులో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఆశిశ్ కుమార్‌, దీపక్ కుమార్, విజయపాల్‌ను స‌స్పెండ్ చేశామ‌ని ఎస్పీ అంకిత్ మిట్టల్ శనివారం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo