శనివారం 04 జూలై 2020
Crime - May 28, 2020 , 17:28:09

కరోనా బాధితుడి అనుమానాస్పద మృతి

కరోనా బాధితుడి అనుమానాస్పద మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఉన్న ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి నగరంలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మే 26న అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అయితే అతడు బుధవారం రాత్రి హాస్పిటల్‌ నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడానికి సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ వ్యక్తిని ఫిరోజాబాద్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు వెల్లడించారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని వైద్యులు తెలిపారు. అయితే అతని మృతికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo