గురువారం 04 జూన్ 2020
Crime - Mar 31, 2020 , 11:58:39

కరోనా లాక్‌డౌన్: వ్యాన్ గో పెయింటింగ్ చోరీ

కరోనా లాక్‌డౌన్: వ్యాన్ గో పెయింటింగ్ చోరీ

హైదరాబాద్: సందట్లో సడేమియా అంటే ఇదే. ఓవైపు కరోనా భయంతో మూసేసిన మ్యూజియంలో నుంచి విలువైన పెయింటింగ్ చోరీకు గురైంది. నెదర్లాండ్స్‌లోని లారెన్‌లో గల సింగర్ మ్యూజియంలో విశ్వవిఖ్యాత చిత్రకారుడు వ్యాన్ గో గీసిన ది పార్సనేజ్ గార్డెన్ ఎట్ నూనెన్ ఇన్ స్ప్రింగ్ అనే పెయింటింగ్ అపహరణకు గురైంది. సుమారు 136 సంవత్సరాల క్రితం ఆ పెయింటింగ్‌ తయారైంది. ఓ కిటికీ అద్దం బద్దలు కొట్టి దొంగ/లు లోపలికి ప్రవేశించారు. దాంతో అలారం మోగింది. కానీ పోలీసులు వచ్చేసరికి పెయింటింగ్‌తో సహా దొంగ/లు పరార్! సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తు, చుట్టుపక్కలవారిని విచారిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ గో పెయింటింగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలు పలుకుతాయనేది తెలిసిన విషయమే.


logo