శనివారం 31 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 18:47:51

బాలుడిపై అత్యాచారం.. వంట మ‌నిషి అరెస్ట్‌

బాలుడిపై అత్యాచారం.. వంట మ‌నిషి అరెస్ట్‌

చెన్నై: త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబ‌త్తూరు న‌గ‌రంలోని అత్తియ‌పాలెం ఏరియాలో ఎనిమిదేండ్ల బాలుడిపై ఓ 54 ఏండ్ల వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఓ క్యాంటీన్‌లో కుక్‌గా ప‌నిచేసే వ్య‌క్తి ప‌క్కింటి బాలుడిపై క‌న్నేశాడు. ఆ బాలుడి తండ్రి విధుల‌కు, త‌ల్లి బ‌య‌ట‌కు వెళ్లి స‌మ‌యం చూసి బాలుడిని బిల్డింగ్‌పైకి తీసుకెళ్లాడు. అక్క‌డే అత‌నిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ త‌ర్వాత విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించి క్యాంటీన్‌లోకి వెళ్లిపోయాడు. 

అయితే, త‌న త‌ల్లి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత బాలుడు జ‌రిగిన విష‌యం ఆమెకు చెప్పాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుడి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. అత‌నిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.