బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Oct 21, 2020 , 18:00:13

కార్మికుడిని కత్తితో పొడిచిన కాంట్రాక్టర్

కార్మికుడిని కత్తితో పొడిచిన కాంట్రాక్టర్

రంగారెడ్డి : జిల్లాలోని ఫ‌రూఖ్‌న‌గ‌ర్ మండ‌లం కాశిరెడ్డిగూడా గ్రామ స‌మీపంలోని సౌత్ గ్లాస్ కంపెనీలో ఘోరం జ‌రిగింది. భోజ‌నానికి చెల్లించాల్సిన‌ డ‌బ్బుల విష‌యంలో కాంట్రాక్ట‌ర్‌, కార్మికుల‌కు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఓ నిండు ప్రాణాన్ని బ‌లిగొన్న‌ది. ఆవేశంతో ఊగిపోయిన కాంట్రాక్ట‌ర్.. ఓ కార్మికుడి క‌డుపులో క‌త్తితో పొడిచాడు. బాధిత కార్మికుడు ఉస్మానియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 

షాద్‌న‌గ‌ర్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన క‌రుకుమార్‌, కృష్ణ‌కుమార్‌, ఉమేశ్ సింగ్.. సౌత్ గ్లాస్ కంపెనీలో ప‌ని చేస్తున్నారు. ఉమేశ్ సింగ్ కూలీల కాంట్రాక్ట‌ర్ కాగా, కరుకుమార్ హెల్ప‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉమేశ్ సింగ్ కూలీల‌కు భోజ‌నం పెట్టించాడు. ఆ భోజ‌నానికి స‌రిప‌డ డ‌బ్బుల కంటే అద‌నంగా రూ. 2 వేలు వ‌సూలు చేశాడు ఉమేశ్ సింగ్‌. దీంతో అత‌న్ని క‌రుకుమార్ నిల‌దీయ‌గా.. ఈ నెల 18న క‌త్తితో పొడిచాడు. తీవ్ర గాయాల‌పాలైన క‌రుకుమార్ ఉస్మానియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. మృతుడి సోద‌రుడు కృష్ణ కుమార్ ఫిర్యాదు మేర‌కు షాద్‌న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.