ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 16, 2021 , 22:31:35

రూపేశ్‌ను హ‌త‌మార్చింది కిరాయి హంత‌కులే: బీహార్ డీజీపీ

రూపేశ్‌ను హ‌త‌మార్చింది కిరాయి హంత‌కులే: బీహార్ డీజీపీ

పాట్నా: ప‌్రైవేట్ విమాన‌యాన సంస్థ ఇండిగో మేనేజ‌ర్ రూపేశ్ కుమార్ సింగ్‌ను కిరాయి హంత‌కులే హ‌త‌మార్చార‌ని బీహార్ డీజీపీ ఎస్‌కే సింఘాల్ పేర్కొన్నారు. ఈ హ‌త్య కేసు ద‌ర్యాప్తు పురోగ‌తిపై ఎస్‌కే సింఘాల్ శ‌నివారం సీనియ‌ర్ పోలీసు అధికారుల‌తో స‌మీక్షించారు. ఇది పూర్తిగా కిరాయి హంత‌కుల ప‌నేన‌ని త‌ర్వాత మీడియాకు వెల్ల‌డించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధికార నివాసానికి అత్యంత స‌మీపంలో.. రూపేశ్ కుమార్ సింగ్ అపార్ట్‌మెంట్ ముందే మంగ‌ళ‌వారం మోటారు సైకిల్‌పై వ‌చ్చిన దుండ‌గులు కాల్చి చంపిన ఘ‌ట‌న రాష్ట్రంలో సంచ‌ల‌నం నెల‌కొల్పింది. 

ఈ అంశం చాలా సున్నిత‌మైంది, సంక్లిష్ట‌మైంద‌న్న డీజీపీ ఎస్‌కే సింఘాల్‌.. ఈ కేసును ప‌లు కోణాల్లో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని చె‌ప్పారు. ఈ హ‌త్య కేసు మూలాల‌ను వెలికి తీస్తామ‌ని, త్వ‌ర‌లో నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని అన్నారు. కేసు ద‌ర్యాప్తు పూర్త‌య్యే వ‌ర‌కు, స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భించే వ‌ర‌కు కేసు వివ‌రాలు వెల్ల‌డించ‌బోమ‌న్నారు. 

త్వ‌ర‌లో ఈ కేసు పూర్వాప‌రాల‌ను బ‌హిర్గ‌తం చేస్తామ‌ని డీజీపీ ఎస్‌కే సింఘాల్‌ వివ‌రించారు. ఇదిలా ఉంటే, దీనిపై అధికార జేడీయూ, ప్ర‌తిప‌క్ష ఆర్జేడీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న‌ది. సీఎం నితీశ్ కుమార్ హ‌యాంలో రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి క్షీణిస్తున్న‌ద‌ని విప‌క్ష నేత తేజస్వి యాద‌వ్ ఆరోపించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo