శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 19, 2020 , 17:10:43

విద్యుదాఘాతంతో కంటైనర్‌ దగ్ధం... ఇద్దరు సజీవ దహనం

 విద్యుదాఘాతంతో కంటైనర్‌ దగ్ధం... ఇద్దరు సజీవ దహనం

అమరావతి : కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి లో దారుణం జరిగింది. గొల్లపల్లి  నుంచి పొలసానిపల్లి వెళ్లే రహదారిలో విద్యుదాఘాతంతో కంటైనర్‌ దగ్ధమై ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. బైక్‌పై అటుగా వెళుతూ దగ్ధమవుతున్న కంటైనర్‌ను పట్టుకోవడంతో ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతంతో బైక్‌తో సహా సజీవ దహనం అయ్యారు. ముగ్గురు కానిస్టేబుళ్లు మారేశ్వరరావు, శివన్నారాయణ, కృష్ణ కాలిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. వెలికితీసిన మృతదేహాలను రూరల్‌ ఎస్‌ఐ రంజిత్‌ కుమార్‌ సిబ్బందితో కలిసి ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ఫైర్‌ ఇంజన్‌ వచ్చేలా కృషి చేసి మంటలను అదుపులోకి తేవడంతో ప్రమాద తీవ్రతను తగ్గించిన నూజివీడు సిఐ రామచంద్రరావు, నూజివీడు రూరల్‌ ఎస్‌ఐ రంజిత్‌ కుమార్‌ను, మరీ ముఖ్యంగా ధైర్య సాహసాలు ప్రదర్శించి మృతదేహాలను వెలికి తీసిన కానిస్టేబుళ్లను స్థానికులు అభినందించారు.

ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...

  పెరిగిన పసిడి ధరలు... ఎంతంటే..?

'శ్రీ గురు తేఘ్‌ బహదూర్‌ జీ'కి ప్రదాని మోడీ నివాళులు

మంచు లక్ష్మీ కుమార్తెకు నొబెల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి