మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 11:37:07

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి

వరంగల్ అర్బన్ : విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. 100 ఫీట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోవా కర్రలు తీస్తుండగా కరెంట్ షాట్ తగిలి నక్క అశోక్ (తాపీ మేస్త్రీ) అనే వ్యక్తి అక్కడికక్కడే మతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం దవాఖానకు తరలించారు.


logo