శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 19:31:09

మ‌హిళా స‌హోద్యోగికి అశ్లీల చిత్రాలు పంపిన కానిస్టేబుల్ స‌స్పెండ్‌

మ‌హిళా స‌హోద్యోగికి అశ్లీల చిత్రాలు పంపిన కానిస్టేబుల్ స‌స్పెండ్‌

షాజహాన్‌పూర్ : మహిళా సహోద్యోగికి వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు పంపినందుకు ఉత్తర ప్రదేశ్‌లోని షాజహన్‌పూర్ జిల్లాలో ఓ  పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వ‌హిస్తున్న కానిస్టేబుల్ నిసార్ హుస్సేన్ ఓ మ‌హిళా కానిస్టేబుల్‌కు వాట్సాప్‌లో అశ్లీల చిత్రాల‌ను పంపాడు. దీంతో ఆమె ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే అత‌డిని స‌స్పెండ్ చేశామ‌ని ఎస్పీ ఎస్ ఆనంద్ తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా సర్కిల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo