మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 31, 2020 , 20:17:19

మ‌హిళ‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. కానిస్టేబుల్ సస్పెండ్

మ‌హిళ‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. కానిస్టేబుల్ సస్పెండ్

రాజ‌న్న సిరిసిల్ల : జిల్లాలోని రుద్రంగి మండల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్‌ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విధుల నుండి సస్పెండ్ చేశారు. రుద్రంగీ మండలంలోని ఓ తండాకు చెందిన మహిళతో జ‌రిపిన‌ రాసలీల సంభాషణలు వెలుగులోకి రావడంతో ఎస్పీ క్ర‌మ‌శిక్ష‌ణా చర్యలు చేపట్టారు. భూమి విషయంలో పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళతో కానిస్టేబుల్ ఫోన్ కాల్ సంభాషణలు బహిర్గతమయ్యాయి. ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మార‌డంతో విష‌యం తెలిసిన ఎస్పీ.. ప్రశాంత్ నిర్వాకంపై నివేదిక‌ తెప్పించుకుని శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టారు.


logo