సోమవారం 30 నవంబర్ 2020
Crime - Oct 22, 2020 , 17:14:52

చలివాగులో పడి కానిస్టేబుల్ గల్లంతు

చలివాగులో పడి కానిస్టేబుల్ గల్లంతు

వరంగల్ రూరల్ : ఈత సరదా ప్రాణం తీసిన విషాద ఘటన జిల్లాలోని పరకాలలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వరంగల్ అర్బన్ జిల్లా మామూనూరు టీఎస్పీ బెటాలియన్‌లో పని చేస్తున్న శ్రీధర్ బంధువులతో కలిసి పరకాలకు వచ్చినట్లు తెలిసింది. కాగా, పరకాల పట్టణ శివారులోని చలివాగులో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. వరంగల్ శివనగర్‌కు చెందిన శ్రీధర్ మృతదేహం కోసం పోలీసుల గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.