మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 12, 2020 , 17:25:44

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

లీఫ్ట్‌ ఇచ్చిన మహిళకు కానిస్టేబుల్‌ వేధింపులు

హైదరాబాద్‌ : కారులో లిఫ్టు ఇచ్చిన పాపానికి ఓ మహిళను కానిస్టేబుల్‌ వేధిస్తున్నఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీనగర్‌ కాలనీలో కారులో వెళ్తున్న ఓ మహిళను పట్టణానికి చెందిన కానిస్టేబుల్‌ వీరబాబు తనను సీఎం క్యాంపు ఆఫీస్‌ వరకు డ్రాప్‌ చేయాలని లిఫ్టు అడిగాడు. మహిళ వీరబాబును కారులో ఎక్కించుకొని వెళ్తుండగా.. నెమ్మదిగా మాటలు కలిపి మహిళ వ్యక్తిగత వివరాలు అడిగి ఫోన్‌ నెంబర్‌ కూడా తీసుకున్నాడు‌. కార్యాలయం వద్ద దిగిన తరువాత మరుసటి రోజు నుంచి కానిస్టేబుల్‌ మహిళకు ఫోన్లు చేయడం, వాట్సాప్‌లో మెసేజులు పంపుతూ వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. కానిస్టేబుల్‌ చర్యలకు విసిగిపోయిన మహిళ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ వీరబాబుపై పోలీసులు ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo