మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 18, 2020 , 12:59:55

ఉరేసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఉరేసుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మాల్వియా నగర్‌ కాలనీలో కానిస్టేబుల్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాల్వియా నగర్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే సతేందర్‌ గురువారం రోజువారీగా విధులకు హాజరై రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లాడు. అనంతరం గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి సమీపంలో మ్యాక్స్‌ హాస్పటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి విచారణ జరపుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అతడి వద్ద సూసైట్‌ నోట్‌ లాంటిదేదీ లభించలేదని పేర్కొన్నారు. ఇటీవలే ఆయన సెంట్రల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo