ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 13:36:58

గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

బడాన్‌ : ఉత్తర ప్రదేశ్‌ రాష్ర్టం బడాన్‌ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి చెందగా హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌ అభిషేక్‌(25), మరో హోంగార్డు జైవర్‌తో కలిసి ఫైజ్‌గంజ్‌ బెహతా ప్రాంతంలోని కరణపూర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఓ గుర్తుతెలియని వాహనం వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అభిషేక్‌, జైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అదించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మొరాదాబాద్‌ దవాఖానకు తరలిస్తుండగా అభిషేక్‌ మార్గమధ్యంలో మృతిచెందాడు. హోం గార్డు చికిత్స పొందుతున్నాడని, అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్పీ సిద్ధార్థ్‌ వర్మ తెలిపారు. వీరిని ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo