ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 14:47:04

మహిళా సహోద్యోగిని కాల్చి.. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌

మహిళా సహోద్యోగిని కాల్చి.. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్‌

పాట్నా: బీహార్ మిలిటరీ పోలీస్ (బీఎంపీ) కానిస్టేబుల్ ఒక మహిళా కానిస్టేబుల్‌ను హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టం డార్జిలింగ్ పట్టణానికి చెందిన కానిస్టేబుల్‌ అమర్‌ (36) మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పాట్నాలో మహిళా కానిస్టేబుళ్లు ఉంటున్న వసతి గృహానికి వెళ్లాడు. అక్కడ అతడు వర్ష(26)తో గొడవ పడి కోపంతో ఆమెపై కాల్పులు జరిపాడు.

తుపాకీ చప్పుడు విని క్యాంపస్‌లో నివాసం ఉంటున్న ఇతర పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలం వద్దకు వచ్చే లోపు అమర్‌ కూడా తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు. వెంటనే సిబ్బంది వారిని స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అమర్‌, వర్షల మధ్య సంబంధం ఏంటి? అమర్‌ మహిళా కానిస్టేబుల్‌ను ఎందుకు హత్య చేశాడు? తదితర వివరాలు తెలియాల్సి ఉందని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని ఎస్‌ఎస్‌పీ ఉపేంద్ర శర్మ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo