ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 12:34:49

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

మీరట్ : ఉత్తర ప్రదేశ్ రాష్ర్టం మీర‌ట్ జిల్లాలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వ‌హిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్ గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మీర‌ట్‌కు చెందిన మాంగేరామ్ (32) వృత్తి రిత్యా కుటుంబానికి దూరంగా పోలీస్ క్వార్ట‌ర్స్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం అత‌డు కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్ చేసి మాట్లాడి అదే రోజు రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌డి రూమ్‌మేట్ కానిస్టుబుల్ అజ‌య్‌కుమార్ 8 గంట‌ల స‌మ‌యంలో విధులు ముగించుకొని గ‌దికి వ‌చ్చిన‌ప్ప‌డు త‌లుపులు ఎంత కొట్టినా తీయ‌క‌పోవ‌డంతో అనుమానం వేసి కిటికీలో నుంచి చూడ‌గా మాంగేరామ్ ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించాడ‌ని తెలిపాడు.

అయితే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించి, కేసు న‌మోదు చేసుకొని అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసు సూపరింటెండెంట్ అఖిలేష్ నరేన్ అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo