శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 10:40:37

భార్యతో వివాదం.. కుమారుడి గొంతు కోసిన భర్త

భార్యతో వివాదం.. కుమారుడి గొంతు కోసిన భర్త

థానే : మహారాష్ట్రలోని థానె జిల్లా నలసోపారా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకొని తన కుమారుడి గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాలు.. నలసోపారా ప్రాంతానికి చెందిన 38 ఏండ్ల ఎజాజ్‌ అహ్మద్‌ అబ్దుల్‌ వాహిల్‌ అన్సారీ అతడి భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. భర్తతో విసిగి వేసారిన భార్య తన 14 ఏండ్ల కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. భర్త ఎంత చెప్పినా ఆమె తిరిగి తన వద్దకు రాకపోవడంతో కోపం పెంచుకున్న ఎజాజ్‌ ఆగస్టు 8న తన భార్య వద్దకు వెళ్లి కుమారుడిని బలవంతంగా తీసుకొచ్చాడు. తరువాత అతడిని వేరే చోటుకు తీసుకెళ్లి తనవద్ద నున్న కత్తితో గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలుడిని స్థానికులు గుర్తించి దవాఖానకు తరలించి అతడి తల్లికి సమాచారం అందించారు. 

తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొడుకును చంపడానికి ప్రయత్నించిన ఎజాజ్‌ను సోమవారం అరెస్టు చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo