మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 20, 2020 , 18:21:33

‘మృత్యుబావి కేసులో పూర్తైన సాక్షుల విచారణ’

‘మృత్యుబావి కేసులో పూర్తైన సాక్షుల విచారణ’

వరంగల్ రూరల్ : కొద్ది నెలల క్రితం జిల్లాలో సంచలనం సృష్టించిన మృత్యుబావి కేసు సాక్షుల విచారణ పూర్తయింది. జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంటలో వరుసగా తొమ్మిది మందిని హత్య చేసి బావిలో పడేసిన కేసులో మంగళవారం నాటికి సాక్షుల ట్రయల్ పూర్తయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ నేరం చేశాడని నిరూపించడం కోసం 87 మంది సాక్షుల్ని, వారి వాంగ్మూలాల్ని పోలీసులు సేకరించగా 67 మంది సాక్షుల్ని కోర్టు విచారించిందని పేర్కొన్నారు.

నిందితునికి వ్యతిరేకంగా నమోదైన సాక్షాధారాలను అతనికి వినిపించడం కోసం కేసును న్యాయమూర్తి కె జయకుమార్ బుధవారానికి వాయిదా వేశారు. నిందితుడు సంజయ్‌కు ఇంగ్లీష్, తెలుగు భాషలపై పట్టు లేకపోవడముతో అతనికి వచ్చిన హిందీ భాషల్లో అర్థం చేయించడం కోసం సీనియర్ న్యాయవాది మహ్మద్ వలియుద్దీన్‌ను గారిని కోర్టు నియమించింది. సంచలనం రేపిన ఈ కేసులో వరుసగా 19 రోజులు ట్రయల్ కొనసాగిందని ప్రాసిక్యూటర్ సత్యనారాయణ తెలిపారు.