ఆదివారం 17 జనవరి 2021
Crime - Dec 11, 2020 , 16:13:46

యువ‌తిపై అత్యాచారం చేసి.. భ‌వ‌నం పైనుంచి తోసేసి..!

యువ‌తిపై అత్యాచారం చేసి.. భ‌వ‌నం పైనుంచి తోసేసి..!

సూర‌త్‌: గుజ‌రాత్ రాష్ట్రం సూర‌త్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. న‌గ‌రంలో పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 ఏండ్ల యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డి, అనంత‌రం భ‌వ‌నంపై నుంచి కింద‌కు తీసేశారు. దాంతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల మ‌ధ్య‌గా ఉన్న రోడ్డుపై ఆ యువ‌తి ప‌డిపోయింది. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ప‌డివున్న యువ‌తిని చూసి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గురువారం ఉద‌యం ఆప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఆస్ప‌త్రి చేర్చామ‌ని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని పోలీసులు చెప్పారు. అయితే నిందితుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని బాధితురాలి చెప్ప‌లేక‌పోతున్న‌దని, తాము ప్ర‌స్తుతం నిందితుడిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని తెలిపారు. నిందితుడు ప‌ట్టుబ‌డితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంద‌న్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.