బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 15:21:12

పాయింట్‌ బ్లాక్‌లో తుపాకీ పెట్టి.. దొంగతనానికి యత్నించి

పాయింట్‌ బ్లాక్‌లో తుపాకీ పెట్టి.. దొంగతనానికి యత్నించి

ఉత్తరప్రదేశ్‌ : ఘజియాబాద్‌ జిల్లా సిహాని గేట్ ప్రాంతం నంద్ గ్రామ్ గ్రామంలో ఇంటర్నెట్ కేఫ్ యజమాని పాయింట్‌ బ్లాక్‌లో తుపాకీ పెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరిలో ఒకరు పోలీసులు పట్టుబడగా మరొకరు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తి నుంచి పోలీసులు నగదుతోపాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సహారాన్‌పూర్ జిల్లా గంగో పట్టణవాసి సచిన్‌గా గుర్తించారు.

సైబర్ కేఫ్ యజమాని చమన్ కేఫ్‌లో ఉండగా సచిన్‌ అతడి సహచరుడు పంకజ్‌ కేఫ్‌లోకి వచ్చి చమన్‌ కణతపై తుపాకీ పెట్టి నగదు అపహరించి పారిపోతుండగా పోలీసులు సచిన్‌ను పట్టుకోగా పంకజ్ తప్పించుకున్నాడు. వీరిద్దరూ సహారాన్‌పూర్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. పరీక్షల్లో ఫెయిలై చదువు మానేసి సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనానికి యత్నించారని ఘజియాబాద్‌ ఎస్పీ అభిషేశ్‌ వర్మ తెలిపారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo